Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
సర్పంచ్ వేధింపు చర్యలకు పాల్పడ్డాడని ఓ ఆశా కార్యకర్త పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నాని కి పాల్పడిన సంఘటన చోటుచేసుకొంది. బాధితు రాలు ఆశ కార్యకర్త కునావత్ నీలా కథనం ప్రకారం ఖానాపురం మండలంలోని బోటిమీది తండాతో పా టు నాజీతండాల్లో ఆశాకార్యకర్తగా పనిచేస్తుంది. నా జీ తండాకు చెందిన సర్పంచ్ బాధవత్ బాలకిషన్, యూత్ అధ్యక్షులు మాలోతు శ్రీనివాస్ అనే ఇద్దరు కొంతకాలంగా ఆశా కార్యకర్త నీలాను వేధింపు చర్యల కు పాల్పడుతూ వచ్చారు. విధులు సక్రమంగా నిర్వ ర్తించడం లేదని పలు అవినీతి ఆరోపణలు చేస్తూ గ్రామ సభల్లోనూ, మండల సభలో తీర్మాణం చేసి వై ద్యారోగ్యశాఖ అధికారులకుఫిర్యాదు చేశారు. తరుచూ మానసికంగా వేధించడం వల్ల నీలా శని వారం పు రుగులమందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిం ది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు నర్సంపేట లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నీలా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
ఆశా కార్యకర్తను వేధించారనే ఆరోపణ అవాస్తవం : బాధవత్ బాలకిషన్, నాజీతండా సర్పంచ్
ఆశా కార్యకర్త నీలాను తాను వేధించడాని ఆరో పణలో ఎలాంటి వాస్తవం లేదు. ఆశా కార్యకర్త సక్ర మంగా విధులు నిర్వర్తించడం లేదు.పైగా గర్భిణీల ప్రసూతికై ప్రభుత్వఆసుపత్రికి తీసుకెళ్లకుండా ప్రయి వేటు ఆసుపత్రికి తీసుకెళ్లికమీషన్లు తీసుకుం టుం దని వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. పలుదఫాలుగా హెచ్చరించినప్పటికీ ఆమె లో మార్పురాలేదు. గ్రామసభ, మండల సభలో తీ ర్మాణాలు చేసి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశాం. అధి కారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ఆశా కార్యకర్త తాము వేధించారని చెబుతుంది.ఎలాంటి విచారణ కౖనా తాము సిద్ధంగా ఉన్నాం.