Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షీ టీమ్ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్
మహిళలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోష ల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు బహి ర్గతం చేయకుండా జాగ్రత్త వహించాలని వరంగల్ షీ టీమ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం ప్రాక్టీసింగ్ ప్రభుత్వ ఉన్నత పాఠ శాల లష్కర్ బజార్ హనుమకొండలో 150 మంది విద్యార్థులకు సైబర్‌నేరాలు, మహిళలపై అత్యాచారా లు, విద్యార్థులపై అఘాయిత్యాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహిం చాలని విద్యార్థినీలు ఎవరినుండైన ఇబ్బందులకు గు రైనప్పుడు, ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా ప్రవ ర్తించిన వెంటనే ధైర్యంగా షీ టీమ్‌కి సమాచారం అందజేయాలనిన్నారు. ఫిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచి నేరస్థుల కు కౌన్సిలింగ్ ఇచ్చి చర్య తీ సుకుంటామన్నారు. విద్యా ర్థులకు సమస్యలు ఎదురై నప్పుడు తల్లిదండ్రులు, కు టుంబ సభ్యులు, ఉపాధ్యా యులతో పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలో నివారించవచ్చని ఆయన అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ నేటి కాలంలో అమ్మాయి లు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయాణాలు చేసేటప్పు డు అపరిచిత వ్యక్తులతో ఎలాంటి విషయాలను, ఫో న్ నంబర్లను, ఫోటోలను, సోషల్ మీడియాలో పరిచ యమైన వారితో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకో వద్దని, ప్రేమపేరుతో వాళ్లు చెప్పే మాటలను నమ్మి తల్లిదండ్రులకు తెలుపకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లవద్దన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రభాకర్, ఉపాధ్యాయ బృందం, హెడ్‌కానిస్టేబుల్ బిచ్చానా యక్, కానిస్టేబుల్స్రాంరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.