Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చరిక బోర్డులను అమర్చిన అధికారులు
నవతెలంగాణ-నర్సంపేట
అనుమతి లేని వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని నర్సంపేట మున్సిప ల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి అన్నారు. 'నవతెలంగాణ దిన పత్రిక'లో ప్రచురితమైన 'అసైన్డ్ భూముల్లో వెంచర్లు' కథనంపై మున్సిపల్ అధికారులు స్పం దించారు. కమిషనర్ ఆదేశాలమేరకు టీపీఎస్ సునీల్, సిబ్బంది బందం మాధన్న పేటపేట రోడ్ సర్వే నెంబర్ 111/1లోని అసైన్డ్ భూముల్లో అక్రమ వెంచర్ వద్ద హెచ్చరిక బోర్డు లను అమర్చారు.. దీంతో పాటు మహబూబాబాద్ రోడ్డు పక్కన పసునూరు కాల్వ వద్ద అనుమతి లేని వెంచర్, ద్వారకపేటలోని బాల్నె సర్వేశం మిల్లు స్థలంలో అనుమతి లేని వెంచర్ ప్రదేశాల వద్ద బోర్డులను ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటస్వామి మాట్లాడుతూ మున్సిపల్ నిబం ధనల ప్రకారం అనుమతి లేకుండా వెంచర్లు చేసి ప్లాట్లను చేయరాదన్నారు. ఇక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలు చేయవద్దని అన్నారు.