Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
వికలాంగుల ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగాలని హ నుమకొండ జిల్లా విజాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య అన్నారు. వికలాంగుల జాయిం ట్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో 2016- వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతినెలలో నాలుగవ శనివారం వికలాం గుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం తప్ప నిసరిగా జిల్లాకలెక్టర్ అధ్యక్షతన జర గా లని డిమాండ్ చేస్తూ వికలాంగుల సమస్యలతో కూడి న వినతిపత్రాన్ని జిల్లా మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి సబిత కు అం దజేసినట్లు రాజయ్య తెలిపారు. ప్రత్యేక ప్రజా వాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గైరాజరు కావడం విచార కరమన్నారు. జిల్లా కలెక్టర్ గైరాజరు వల్ల వికలాంగు ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత తగ్గి పోతు న్నదనీ ఇప్పటికైనా భవిష్యత్‌లో జరిగే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి తప్పని సరిగా ఒక గంట సమయాన్ని కేటాయించి హాజరు కావలసిందిగా విక లాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేస్తుందన్నారు.
డిసెంబర్ 3న జరిగిన ప్రపంచ విక లాంగుల దినోత్సవం రోజున వికలాం గుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ ఉద్యోగి వెంకట్రాంపై 2016-వికలాంగుల హ క్కులచట్టం ప్రకారం చర్యలు తీసుకోవా లని రెండుసార్లు ప్రత్యేక ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించినా కూడా చర్య లు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన జిల్లా సంక్షేమ అధికారిపై సబితపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డి మాండ్ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ వికలాం గుల సంఘం అధ్యక్షులు శాన మహేందర్ కోశాధికారి జి.శ్రీకాంత్,ముఖ్య సలహాదారులు భీమవరపు ధనుం జరు కుమార్ పాల్గొన్నారు.