Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
వ్యవసాయాభివృద్ధికై నిర్విరామంగా కృషి చేయ డం వల్లనే నియోజకవర్గంలో సాగువిస్తీర్ణం పెరిగి రై తులు అధిక దిగుబడులు సాధించగలుగుతున్నా రని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం క్యాం ప్ కార్యాలయ ఆవరణంలో ఉద్యానవన శాఖచే 300 మంది రైతు లబ్దిదారులకు సబ్సిడీ పంప్సెట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నియోజకవర్గంలో గోదావరిజలాలతో సాగు నీటి వనరులు సమృద్ధిగా పెరిగాయన్నారు. పాకాల, రంగ య చెరువు ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు సాగు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. మునుపెన్నడు లేని విధంగా అధిక పంటఉత్పత్తులను సాధించారన్నా రు. పంట దిగుబడులను నిల్వ చేసుకొనేందుకు లక్ష మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించామని చెప్పా రు. రైతు సంక్షేమమే ప్రధానధ్యేయంగా సీఎం కేసీఆ ర్ 24గంటల విద్యుత్‌ను అందించారని ఇటీవల ప లు సాంకేతిక కారణాల వల్ల సరఫరాలో కొంత అంత రాయం ఏర్పడిందన్నారు. దీనిని కొన్ని పార్టీలు రైతు లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారన్నారు. రైతుపక్షాన ఏనాడు ఆలోచనచేయని వారు ప్రభుత్వా న్ని విమర్శలు చేయడం వచ్చే ఎన్నికల్లో పబ్బం గడు పుకోవడం కోసమేనని విమర్శించారు. ప్రజలు ఆపద లో ఉంటేఅందుబాటులో లేనివారు నేడు పల్లెల్లో తి రుగుతూ కపటప్రేమను చూసిస్తున్నారని ఎద్దేవ చేశారు. చవకబారు విమర్శలు చేసే వారు ప్రజల్లో చులకనకాకతప్పదని హితువు పలికారు.
మరో వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని, రాష్ట్రాని కి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయకుండా తొక్కిప డుతుందన్నారు. రైతులు కేంద్రం అవలంభిస్తున్న కక్ష్య సాధింపు చర్యలను తిప్పుకొట్టే సమయం ఆసన్నమైం దన్నారు. సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి ని రంజన్‌రెడ్డి ప్రత్యేక చోరువతో విద్యుత్ సబ్సిడీ పంప్ సెట్ల పథకం నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేశారని తెలిపారు. ఫలితంగా 5010 యూనిట్లు మంజూరు కాగా రూ.7.51 కోట్ల సబ్సిడీ విడుదలైందని చెప్పారు. ఇప్పటి వరకు 2,589 పంప్సెట్లు రైతులకు పంపిణీ చేశామని దరఖాస్తు చేసిన వారికి త్వరలోనే ఈ యూనిట్లను అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రా ష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, ఎంపీపీ, జెడ్పీ టీసీ, పీఏసీఎస్ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి బాధ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ తదితర ప్రజాప్రతిని ధులు, ఉద్యానవన అధికారులు, నియోజకవర్గంలోని లబ్ధిదారులు పాల్గొన్నారు.