Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా సెమినార్లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ- హన్మకొండ
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరూకృషి చేయాలని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం హన్మకొండలోని ల్యాండ్‌మార్క్ కన్వెన్షన్ హాల్లో కాకతీయ సహకార శిక్షణ కేంద్రం వారి సౌజ న్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బలోపేతం అనే అంశంపై వరంగల్ ఉమ్మడి జిల్లాలో ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షు లకు సహకార నాయకులు,అధికారులకు జిల్లాస్థాయి సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ చోరవతో సహకార సంఘాలు అభివృ ద్ధి చెందుతున్నాయన్నారు.చారిత్రాత్మకమైన నగరం లో డీసీసీబీ బ్యాంక్ కల్పలత,సూపర్ బజార్ త్రిచక్ర సహకార సంఘంలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఇ లాంటి సెమినార్లు మరెన్నో నిర్వహించాలని సహకా ర సంఘాలను బలోపితం చేయడానికి తన వంతు సాయం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. డిసిసి బి చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగపడే సహకార సంఘాలను రైతులు ఆదరించాలని కోరారు.
తెలంగాణరాష్ట్ర సాగర్ యూనియన్ జెంట్ రిజి స్ట్రార్ బి.అరుణ మాట్లాడుతూ సహకార సంఘాల బ లోపేతం కొరకు తగిన చట్టపరమైన, సాంకేతిక పరి జ్ఞానంతో పనిచేయడానికి కావలసిన సమాచారం, వనరుల సమీకరణ, వ్యాపార అభివృద్ధి, ప్రణాళికలు ఏకత మానవవనరుల విధానం, సంఘాల ఆర్థిక పరి పుష్టికి తీసుకోవలసిన చర్యలు అంశాలు సమకూర్చి చట్టానికి బైలాకు లోబడి పాలకవర్గ సభ్యులు సంఘ నిర్వహణలో ఎలామసులుకోవాలో చర్చించే ప్రయ త్నం సెమినార్ ద్వారా జరుగుతుందని ఇలాంటి వేడుకలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓడిసిఎంఎస్ గుగులోతు రా మస్వామినాయక్, జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ లు నాగేశ్వరరావు,సంజీవరెడ్డి, కురుషీద్, మాడిశెట్టి కిరణ్ కుమార్, టిసిజీవో ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, ఆఫీసర్ చిన్న రావు, ప్రాథమిక సహకార సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.