Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారు
- హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-కాజీపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి పాలన సాగిస్తున్నారని, దేశంలో తెలంగాణను ధనిక రాష్ట్రంగా మారుస్తామని చెప్పి అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. కాజీపేట మండలం 62వ డివిజన్ పరిధిలోని సొమిడి నందు శక్తి కేంద్రం ఇంచార్జ్ జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర నర్సింగ్ గౌడ్ అధ్యక్షతన ప్రజా గోస బిజెపి భరోసా శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ శనివారం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. మొదట ఆయన కాజీపేట పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమావేశం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అబద్ధపు మాటలు చెబుతూ మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు, మొదట్లో స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కొరకు ఐదు లక్షలు, చివరకు మూడు లక్షల ఇస్తామని చెప్పి నేటికీ ఒక్కరికి ఇవ్వలేదు ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో మూడు మూడు లక్షలతో ఇళ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందనేది రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు చెప్పాలన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారు. మద్యం అమ్మకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 40,000 కోట్లు ఆదాయం పొందుతుందన్నారు. రాష్ట్ర అభివద్ధి చెందాలంటే బిజెపి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రావు పద్మ, జిల్లా ఇంఛార్జి వి.మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్తినేని ధర్మారావు, రాకేష్ రెడ్డి, నాయకులు గుంటి కుమారస్వామి, కరుణాకర్, రాజేందర్, రాజు, సుధీర్ బాబు, వేణు, గోపాల్, చిరంజీవి, సతీష్ కుమార్, సంతోష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే నగర అభివృద్ది
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ నగర అభివద్ధి జరుగుతుందని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఖిలా వరంగల్ పడమరకోటలో కొప్పుల క్రాంతి ఆధ్వర్యంలో జరిగిన శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ కు హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బిజెపి సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందన్నారు. గత మూడు సంవత్సరాలుగా రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. వరంగల్ నగరాన్ని అన్ని విధాల అభివద్ధి చేసే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకంలో చేర్చి నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు కేటాయించడం లేదని అందువల్లే నగర అభివద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు. వరంగల్ నగర అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.300 కోట్ల నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినెరవేర్చలేదన్నారు.రాబోయే ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పి బిజెపిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, సీనియర్ నాయకులు అచ్చ విద్యాసాగర్, పిట్టల కిరణ్, చంద్రమోహన్, రాజేందర్, మహేష్ పాల్గొన్నారు.