Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐఎం రంగశాయిపేట కమిటీ కార్యదర్శి మాలోతు సాగర్
నవతెలంగాణ-మట్టెవాడ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 59 జీవో ప్రకారం ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరించినట్లుగానే పేదల కోసం తీసుకొచ్చిన జీవో నెం.58 ప్రకారం పేద గుడిసెవాసుల స్థలాలను క్రమబద్ధీకరించాలని సీపీఐ ఎం రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ డిమాండ్ చేశారు. నాయుడు పంపు సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.59 ప్రకారం ప్రభుత్వ భూములను క్రమబద్దికరించాలని చూస్తుందని దానితోపాటుగా 58జీవో ను రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిందని దానికి కారణం తెలంగాణ రాష్టం లో పేదల చేతుల్లో 125 గజలు ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరించడం 58 జీవో ఉద్దేశం అని ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరించడం కంటే ముందు పేదల గుడిసెల భూములను పట్టాలివ్వలని అన్నారు. ఇప్పుడే కాదు గత ప్రభుత్వల తో వామపక్షలు ప్రధానంగా సిపిఎం పార్టీ ఉద్యమాలు పోరాటలను ఈ రాష్ట్రం లో ఆ నిర్వహించిన ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 58,59 జీవోలు తీసుచింది రాష్టం లో పేదల చేతులో వున్నా భూములని క్రమభద్దికరించాలని కోరారు కానీ 59 జీవోలో అదైతే భూములు ఉన్నాయో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారాల కట్టబెట్టి పేదలు వేసుకొని నివాసం వాటిపైన నిర్భందాలు చేయడం సరి కాదని వెంటనే పేదల చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములకి రెగ్యులైజెషన్ చెయ్యాలని ప్రభుత్వంని కోరారు వరంగల్ లో సుమారు 25 వేల కుటుంబాలు సొంత ఇండ్లు లేక గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చాలని కోరారు. జక్కాలోద్ది ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు 58 జీవో ప్రకారం గా పట్టాలిచ్చి పక్కా గహాలు కట్టి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఇప్పటివరకు నెరవేర్చలేదు డబల్ బెడ్ రూమ్ ఇల్లు 100 గ అన్నారు.జాల ఖాళీ స్థలాలు ఉన్న పేదలకు 5 లక్షల ఇవ్వాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారనీ అమీలు అమిలుగానేగ మిగిలిపోయాయినీ నెరవేర్చాలని కోరారు. నిరుపేదలందరూ ఇళ్ల కిరాయిలు కట్టలేక చేసుకుందామంటే పని లేక, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోక పోవడం ఏంటని ప్రశ్నించారు నిరుపేదలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే నెరవేర్చాలని గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు 58 జీఓ ప్రకారంగా పట్టాలిచ్చి పక్కా గహాలు కట్టివాలని డిమాండ్ చేశారు. లేని ఎడలదశలవారీగా ఆందోళన ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం వరంగల్ జిల్లా రంగశాయిపేట ఏరియా కమిటి సభ్యులు గణేపాక ఓదెలు, మాలోతు ప్రత్యుష, డి.సాంబమూర్తి, ఎం.జ్యోతి, కేవీపీఎస్ ఏరియా కమిటీ కార్యదర్శి ఉసిల్లకుమార్, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, పార్టీ శాఖ కార్యదర్శులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.