Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.8 కోట్లతో పనులను ప్రారంభించిన కలెక్టర్ గోపి, ఎమ్మెల్యే అరూరి రమేష్
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేకనిధులతో పనులు చేపడుతున్నామని బీ ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. శనివారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రూ.8కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్, మౌలిక వసతులు, పలు అభి వృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ.గోపితో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే రమేష్ ప్రారంభించారు. అంతకుముందు మండల పరిష త్ అభివృద్ధి కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆంగోత్ అరుణ అధ్యక్షతన నిర్వహించిన వర్ధన్నపేట పురపాలక సంఘం 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వర్దన్నపేట పురపాలక సంఘం రూ.2కోట్ల 85లక్షల 30వేలతో ప్రతిపాదించిన 2023-24 వార్షిక బడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమెదించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ వర్దన్నపేట పురపాలక సంఘం ఆదాయ వనరులను పెం పొందించుకునేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని సూచిం చా రు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పట్టణ పరిధిలో నిర్మించే భవనాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు విధిగా అనుమ తులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో పారిశుధ్యం, పచ్చదనంకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అన్నా రు. మున్సిపల్ సిబ్బంది అంకితభావంతో పని చేసి పట్టణ ప్రజ లకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. మున్సిపల్పాలకవర్గం, అధికారులు సమన్వయంతో ప్ర ణాళికబద్దంగా పనిచేయడంతోపాటు, ప్రాధాన్యత క్రమంలో అభి వృద్ధి పనులను పూర్తి చేయాలని తెలిపారు.
మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో పట్టణ అభివద్ధికి మరింత కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, వైస్ చైర్మన్ కో మాండ్ల ఎలేందర్ రెడ్డి, వర్దన్నపేట మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, కొండేటి అనిత, సరిత, పూజారి సుజాత, కోదాటి పద్మ, తుమ్మల రవీందర్, మంచాల రా మకృష్ణ, సమ్మెట సుధీర్, కో-ఆప్షన్ సభ్యులు అజీమ్, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, మున్సిపల్ అధికారులు కిరణ్,శంకర్,అయిలయ్య, మురళీ,క్రాంతి, సాంబలక్ష్మీ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.