Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
ప్రాథమికస్థాయి విద్యా ప్రమాణాలు విద్యా ర్థులు సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తొలిమెట్టు, మనఊరు-మనబడిపై జిల్లాస్థాయి సమీక్ష సమా వేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ తొలిమెట్టు అమలులో నోడల్ అధికారులు శ్రద్ధ వహించాలని,మన ఊరు మన బడి పనుల్లో వేగంపెంచాలని, ఇంజనీరింగ్ అధి కా రులతో సమీక్ష చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లాసెక్టోరల్ అధికారులు, మండల నోడల్ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, డిపిఏంయు సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించి జిల్లాలో తొలిమెట్టు అమలు తీరును మండలాల వారీగా సమీక్షించారు. మండల నోడల్ అధికా రులు, ప్రతినెల పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయుల బోధనా తీరును గమనిస్తూ, విద్యా ర్థుల ప్రగతిని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆశించిన అభ్యసన సామర్ధ్యాలు విద్యార్థులు అందుకోవడానికిఇబ్బందులు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరిం చాలి అనే వాటి పై మండల తొలిమెట్టు నోడల్ అధికారులను అడిగి తెలు సుకుని తగుసూచనలు చేశారు. ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి పాఠశాలలో పాఠ్యప్రణాళిక, బోధనోపకరణాలు అనేటివి తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ఏయే పాఠశాలలు మంచిగా పనిచేస్తున్నా యి, తొలిమెట్టు కార్యక్రమం నిర్లక్ష్యానికి గురవుతుందో మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
అలాగే పదవ తరగతి విద్యార్థులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఎక్కువ 10/10 జిపిఏలు సాధిం చడానికి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టేలా తగు సూ చనలు చేశారు. తల్లితండ్రుల సమావేశాలలో విద్యార్థుల ప్రగతిని ప్రదర్శిం పచేయాలని, పాఠశాలలను సమాజానికి దగ్గరగాఉంచితే ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ మహమ్మద్ అబ్దుల్హై మండల నోడల్ అధికారులకు, కాంప్లెక్స్ నోడల్ అధికారు లకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ. శ్రీనివాస్, ప్లానింగ్ కోఆర్డినేటర్ పోరెడ్డి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారులు ఈసారి రవీందర్, రామ్ కిషన్ రాజు, రమాదేవి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.