Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పోలీసు స్టేషన్‌కు వచ్చే భూ తగాదా కేసుల్లో పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ పోలీసు కమిషనర్ ఎ.వి. రంగనాధ్ అధికారులను ఆదేశించారు. శనివారం హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021 నుండి పెండింగ్‌లో వున్న కేసులను తక్షణమే పరిష్కరించాలన్నారు. విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దని, శాంతి భద్రతలకు సంబంధించి ప్రజలకు అభద్రతభావం కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా విజువల్ పోలీసులలో భాగంగా అధికారులు, సిబ్బంది కీలక సమయాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలన్నారు. నేరస్తులను గుర్తించడంతోపాటు నేర నియంత్రణ కోసం ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలన్నారు. కమిషనరేట్ పరిధిలో గుడుంబా తయారీకి అవసరమైన ముడి పదార్ధాల అమ్మకాలు, రవాణా కూడా నియంత్రించాలన్నారు. మహిళలకు సంబంధించిన నేరాలపై వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా, మార్ఫింగ్ చేసినవాహనదారులపై చీటింగ్ కేసులను నమోదు చేయాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వాహనదారుల వాహనాలను సీజ్ చేసి, మైనర్ డ్రైవర్లు, వాహన యజమానులపై ఛార్జ్‌షీట్ వేయాలన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు ఎండి బారీ, కరుణాకర్, సీతారాం, మురళీధర్, అదనపు డిసిపిలు పుష్పా, సంజీవ్, సురేష్‌కుమార్‌తోపాటు ఎసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.