Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ డెస్క్
మండలంలోని వనపర్తిలోని పివిఆర్ పాఠశాలలో శనివారం ఎల్లో డే కార్యక్రమా లు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల కరస్పాండెంట్ లయన్ పప్పు వెంకట్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాఠశాల ఛైర్మెన్ శ్రీలత రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లో డే సందర్భంగా విద్యార్థులు పసుపు రంగు ఆవశ్యకతను తెలు సుకొని పసుపు రంగు మన జీవితానికి ఏ విధంగా సహకరిస్తుందో విద్యార్థులు తమ చక్కటి ప్రదర్శన ద్వారా, పసుపు వస్తువుల ద్వారా, పసుపు పండ్ల ద్వారా, పసుపుకు సంబంధించిన రకరకాల అంశాలను చాలా సృజనాత్మకంగా ప్రదర్శిం చడం అభినందనీయమని తెలిపారు.ఈసందర్భంగా పాఠశాల ఏర్పాటు చేసినటు వంటి నూతన సెమినార్ హాల్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించడం, తల్లిదండ్రులు పాఠశాల కార్యక్ర మం పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల కార్యక్రమాల పట్ల, ఉపాధ్యాయ బృం దం పట్ల పాఠశాలలో జరుగుతున్నటువంటి బోధనపట్ల,పాఠశాల నిర్వహిస్తున్న టువంటి క్రీడలు, లలిత కళలు, ఆర్ట్, క్రాఫ్ట్ వంటి తదితర అంశాలలో శిక్షణ ఇచ్చి పిల్లలను ప్రోత్సహిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలి పారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, తల్లి దండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.