Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కేంద్ర ప్రభు త్వానికి చెందిన పీఎం పోషన్ పోర్టల్లో తప్ప కుండా ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలని జారీ చేసిన ఆదేశాలు వెంటనే విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మ భిక్షం డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్లో ఎస్ఎఫ్ఐ జన గామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలక్టర్ శివలింగయ్యకి మెమొరాండం అందజేసినారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడిగే సందీప్, ధర్మభిక్షం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద కుటుంబాలకు చెందిన విద్యా ర్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్తోమత లేక ప్రభు త్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకుండా పోతుందన్నారు.మధ్యాహ్న భోజ నం పెట్టడంతో విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెరిగిందన్నారు. ఇప్ప టికే బయోమెట్రిక్ వీధి ముద్రలు పడక ప్రజల అవస్థ పడుతున్నారన్నారు. ఈ బయోమెట్రిక్ విధానం వల్ల విద్యార్థులకు తీరని లోటని వెంటనే విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.