Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మహా భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన ఓ పాటు సరస్వతి విగ్రహ నమూనాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్ రావు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పరిశీ లించారు. ఆదివారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నమూనాలను పరిశీలించిన అనంతరం మం త్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్లు మాట్లాడు తూ మూడు కోట్ల వ్యయంతో 22 అడుగుల పోతన పంచ లోహ విగ్రహాన్ని, ఐదు అడుగుల సరస్వతి పంచలోహ విగ్రహాన్ని బమ్మెరలో ప్రతిష్టించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బాసర సలహా లు బమ్మెరలోనే అక్షరాభ్యాసం చేసేందుకు శ్రీకారం చుడుతున్నమ ని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలకుర్తి ప్రాంతాన్ని టూరిజం కారిడా ర్గా మార్చేందుకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని, పర్యాటక పనుల్లో పురోగతి సాధించి త్వరగా పనులు పూర్తి చేయా లని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంత కవుల చరిత్రను ప్రపంచానికి చాటే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జనగామ, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద గిరి రెడ్డి, శంకర్ నాయక్,జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశారు, ఇన్టాక్ట్ కన్వీనర్ పాండురంగా రావు, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పిటిసి శ్రీనివాసరావు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.