Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాకిరి భారెడు వేతనం మూరేడు ఉద్యోగ భద్రత లేదు
- సమస్యల్లో ఎన్సీడీసీఎల్ కార్మికులు
నవతెలంగాణ-తొర్రూరు
గ్రామాల్లో విద్యుత్ సమస్య లేవీ తలెత్తిన అన్ మ్యాన్డ్ (ప్రత్యామ్నాయ) కార్మికులే ముందు గుర్తుకొస్తారు. ఏ సమ యం అయినా వారు రావాల్సిందే. ఎన్సీడీసీఎల్లో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మా రింది. విద్యుత్తు సిబ్బందికి సహాయకారిగా మాత్రమే ఉండా ల్సిన వీరు అన్ని పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి కి పనికి తగ్గ వేతనం అందడం లేదు. విధి నిర్వహణలో ప్రా ణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యులు దిక్కులేని వారు అవు తున్నారు. నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వి ద్యుత్ సంస్థలో 2013 నుంచి అన్ మ్యాన్డ్ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ చాలీచాలని వేతనంతో కాలం వెలబు చ్చుతున్నారు. తొర్రూరు డివిజన్ పరిధిలో 50 మంది అన్ మ్యాన్డ్ కార్మికులు పనిచేస్తుండగా, మహబూబాబాద్ జిల్లా లో 106 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 1532 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 59 మంది ప్రమాదవశా త్తు మృతి చెందగా, మరో 49 మంది కార్మికులు వికలాంగు లయ్యారు. పనిచేస్తున్న కార్మికుల్లో దాదాపు అందరూ ఐటిఐ, డిప్లమా పూర్తి చేసిన వారే. విద్యుత్తు సిబ్బంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ పనిలో వీరిని భాగస్వాములను చేస్తూ వెట్టి చాకిరి చేయిస్తున్నారు. స్తంభం ఎక్కడం, నియంత్రికల ను సరి చేయడం, చెట్టుకొమ్మలను నరకడం, బిల్లుల రీడింగ్ తీయడం, వసూలు చేయడం, నాన్ స్లాబ్ మీటర్ రీడింగులు తీయడం, 11 కె.వి, 33 కెవి ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు పరిష్క రించడం, ఫ్యూజులు వేయడం, మరమ్మతులు చేయడం, మొండి బకాయిలను వసూలు చేయడం, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, తొలగించడం, ఇలా ప్రతి పనిలో వీరి పాత్ర కీలకం గా ఉంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా వెట్టిచాకరి చేయిస్తున్నారు. ఉప కేంద్రాలలో సిబ్బంది లేకపోతే వేరే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రమాదకరంగా విధులు...
సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1532 మంది కార్మికులకు బేసిక్ వేతనం 10,478 కాగా అన్ని కటింగ్లు ఫోను 8,600 రూపాయల వేతనం చెల్లిస్తున్నారు. అయితే వీరు నిబంధనలకు విరుద్ధంగా స్తంభాలను ఎక్కాల్సి వస్తుం ది. ఒకొకప్పుడు సమాచారాల్లోపంతో రాంగ్ ఎల్సి తీసుకోవ డంతో ప్రమాదాలకు గురవుతున్నారు. కొంతమంది స్తంభాల పైనుంచి పడి అంగవైకల్యానికి గురవుతున్నారు.
ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలి...
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న అన్ మ్యాన్డ్ కార్మికులను సంస్థ ఆక్సిజన్లుగా గుర్తించి విద్యుత్ సిబ్బందితో సమానంగా పనికి తగ్గ వేతనం చెల్లించాలని వీరు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. పిఎఫ్ లేదన్న సాకుతో గతంలో వీరిని ఆర్టిజన్లుగా గుర్తిం చలేదు. ప్రస్తుతం ప్రతీ అన్ మ్యాన్డ్ కార్మికుడికి పిఎఫ్ అమల వుతున్న దృష్ట్యా తమను సైతం ఆర్టిజన్లుగా గుర్తించాలని వేడుకుంటున్నారు.
ఆపరేటర్ ఉద్యోగాలను కేటాయించాలి...
సంస్థ చేపట్టే ఉద్యోగ నియామకాల్లో అన్ మ్యాన్డ్ కార్మి కులకు సీనియార్టీ ప్రకారం జూనియర్ లైన్మెన్లుగా, ఖాళీగా ఉన్న ఆపరేటర్ ఉద్యోగాలను, విశ్రాంత ఉద్యోగులు నిర్వహి స్తున్న ఉద్యోగాలలో తమను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, ప్రమాదంలో మరణిం చిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.
సమాన పనికి... సమాన వేతనం చెల్లించాలి...
గుగులోతు బిచ్చు నాయక్, అన్మ్యాన్డ్ కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి
2013 నుంచి విద్యుత్ సంస్థ లో పనిచేస్తున్నాం. చాలీచాలని వేతనాలు ఇస్తున్నారు. పిఎఫ్, ఈఎస్ఐ ఈ రెండు సౌకర్యాలు లేక ఆర్టిజన్లుగా గుర్తించలేదు. ఈ వ్యవస్థ లో కటాఫ్ డేట్ ముందు నుంచి పని చేస్తున్న కార్మికులను ఆర్టిజన్గా గుర్తించాలి. ఖాళీగా ఉన్న సబ్ స్టేషన్లలో ఆపరేటర్లుగా నియమించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 59 మంది కార్మికులు చనిపోగా 49 మంది వికలాంగులు అయినారు. వీరిని సంస్థ ఆదుకోవాలి.
వెట్టి చాకిరి చేయిస్తున్నారు : మహమ్మద్ యాకోబు,
సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తోర్రూరు.
ఎన్నో సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులతో ప్రభుత్వం సమయ పాలన, జాబ్ చార్ట్ లేకుండా వెట్టి చాకిరి చేయిస్తుంది. చాలీచాలని జీతాలతో, అర్ధాకలితో అలమటిస్తు న్నారు. వీరి ఉద్యోగాలను రెగ్యులరై జ్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అర్హులైన వారందరికీ పదోన్నతి కల్పించి వారిని ఆదుకోవాలి.