Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-సంగెం
గ్రామంలో కొంతమంది అవకాశవాదులు రాజకీయాల కోసం ప్రజలను ఇ బ్బంది చేస్తూ, వారి కల్లబొల్లి మాటలతో, మాయ మాటలు చెప్తూ పబ్బం గడుపు కోవడానికి ప్రజలను అనేక ఇబ్బందులు చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రోడ్డు విస్త రణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాలినడకన నడుస్తూ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన భాదితు లతో మాట్లాడారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన 33 కుటుంబాలకు ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం మంజూరు చేసి మంజూరు పత్రాలు కూడా ఇచ్చినట్లు తెలిపారు.గ్రామ అబివృద్ధికి ప్రజలు సహకరిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. త్వరగా మంజూరైన ఇండ్లు నిర్మా ణం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉం చుకొని గ్రామ అభివవృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. కొంతమంది అవకా శవాదులు గ్రామంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసం ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం చేసుకుంటుంటే వారికి అబద్ధాలు చెప్తూ వారి స్వార్థ ప్రయోజ ప్రయోజనాల కో సం అయోమయానికి గురి చేస్తున్నారని అందుకే నేను గ్రామంలో తిరుగుతూ వారికి భరోసా కల్పిస్తున్నానని అన్నారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దొం గలు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మవద్దని ఏ సమస్య ఉన్నా నాకు చెప్పుకో వాలని ప్రజలకు సూచించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం గ్రామ అభివృద్ధిని ఒక రిద్దరూ స్వార్థపూరిత నాయకులు గ్రామాభివృద్ధిని అడ్డుపెట్టుకొని ఆటలాడుతూ ఆటంకంగా మారిండ్లని, వారిని గుర్తించి తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తామని అన్నారు.
గ్రామస్థులతో మాటామంతీ...
గ్రామంలో ఎమ్మెల్యే చల్లా గ్రామస్థులతో కలిసి ముచ్చటించారు. గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనుల గురించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కాసేపు పాత పరిచయాలతో అనేక విషయాల గురించి సమస్యల గురించి అడిగి నందుకు, కాలక్షేపం చేసినందుకు గ్రామస్తులు ఎంతో సంతోషపడ్డారు.ఈ కార్యక్ర మంలో స్థానిక సర్పంచ్ పులుగు సాగర్ రెడ్డి, ఎనుకతాళ్ల రవీందర్, నాయకులు మిల్కూరి రామచంద్రారెడ్డి, కర్ర రాజిరెడ్డి, గాయపు మాధవరెడ్డి, బిజెపి జిల్లా నాయకులు నరహరి సమ్మిరెడ్డి, ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.