Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చుక్క ప్రశాంత్
నవతెలంగాణ-మట్టెవాడ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కూటమి గెలుపొందిన సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలు పులో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం సాక రాశికుంట జంక్షన్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ఎస్ఎఫ్ఐ విజయోత్సవ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చుక్క ప్రశాంత్ మాట్లా డుతూ శుక్రవారం రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సం ఘాల ఎన్నికలు జరిగాయి అందులో భాగంగానే ఏబీవీపీపై ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ విజయకేతనం జెండా ఎగరవేసింది. దేశంలో విద్యార్థీ సంఘా లలో మొదటి స్థానంలో విద్యార్థుల కోసం పోరాటాలు చేసే సంఘంగా ఎస్ఎఫ్ఐ నిలుస్తుందన్నారు. నూతన విద్యా విధానంలో మతతత్వాన్ని జొప్పించే ప్రయత్నం చేస్తుందన్నారు ఈ మధ్యకాలంలో అది బాగా విద్యార్థుల మధ్య కులమత చిచ్చులు పెడుతుందన్నారు. ఒక వైపు అంబేద్కర్ గురించి గొప్పలు చెప్పుకుంటూనే భారత రాజ్యాంగాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మొత్తం కార్పొరేటికరణ చేస్తుందన్నారు. దేశంలో నిరుద్యోగ యువత పెరుగుతుంది నూతన విద్యా విధానంలో శాస్త్రీయ భావజాలం కాకుండా మత చాందస భావాలను జొప్పించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వీటన్నింటినీ విద్యార్థులు గమనిస్తున్నారున్నారు.కాబట్టే విద్యార్థులు మంచి భవిష్యత్తును ఉద్దేశించి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐని గెలిపించారు అని అన్నారు. దీన్నీ మేధావులు ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు అందరూ కలిసి హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజ వర్ధన్, దిలీప్, ప్రశాంత్, సంతోష్, అశోక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.