Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయంగా, పరిపాలనలో సమర్థుడు కేటీఆర్
- రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న మూర్ఖులు బీజేపోల్లు
- మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతుంటే ఒక జోకర్ మాదిరి ప్రజలు చూస్తున్నారని జాతీయ పార్టీ అధ్యక్షుడిగా హుందాతనం మరిచి మాట్లాడు తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అడ్డుకుంటున్న మూర్ఖులనీ, కేంద్ర ప్రభుత్వపు పథకాలతో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగిందనో, కనీసం పేద లకు న్యాయమైన విద్యనందించామనో, చక్కని విద్యా పథకం తెచ్చామనో చెప్పుకు నే పరిస్థితి ఆ పార్టీ ఈప్రాంత నాయకులకు లేదని, భాజపా నాయకులంతా చవ టలు దద్దమ్మలని ఒకటికి వందసార్లు చెబుతానని, ఎనిమిదేళ్ల పాలనలో నిరూ పనైందని, తాను మాట్లాడేది తప్పైతే ఈ గొప్ప పనులు చేశామని చెబితే, తాననే మాటలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. నియోజక వర్గ కేంద్రంలో సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మ న్, జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన, రాజకీయంగా తనకంటూ ప్రత్యేకమైన స్థానంతో పాటుగా, ఇక్కడి పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రపంచంలో అనేక సం స్థలు కేటీఆర్ సమర్థతను గుర్తించి అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానించడం గొప్ప విషయమన్నారు. కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అమలవుతున్న సంక్షేమ, అభివృ ద్ధి పథకాలు దేశానికే మోడల్ నిలిచాయని, తెలంగాణకు కెసిఆర్ నాయకత్వం శ్రీ రామరక్షయని, తన నాయకత్వంలో రాష్ట్రం భద్రంగా ఉంటుందని, హక్కులు కాపాడబడతాయని అన్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించే బీజేపి, కాంగ్రెస్, చిన్నాచితకా ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీని పాదయాత్రల్లో విమర్శిస్తూ కేసీఆర్ పై బిజెపి కాంగ్రెస్ పాదయాత్రలు చేస్తున్నారని అధికార పార్టీని విమర్శిస్తూ కేసీఆర్ పై ఆరోపణలు చేసేందుకే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు అమలవుతున్న పథకాలను తెలుసుకొని తప్పులు దొర్లితేనో, ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, ఈ ప్రాంత ప్రజలకు బిజెపి ఏమి ఇచ్చారు...? ఏమి తెచ్చారు...? చెప్పలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. విభజన హామీలు నెరవేర్చని చవటలు, దద్దమ్మలని ఈ ప్రాంత నాయకులు కిషన్ రెడ్డి, బండి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు పెద్దగా పట్టించుకోరని, పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదని, బహునాయకత్వం, విభేదాలు వల్ల లేచే పరిస్థితి లేదన్నారు. నియోజక వర్గంలో ప్రతీ గ్రామానికి సాగునీరు, మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని, కెసిఆర్ సాధించిన ప్రగతని వివరించారు. బండి సంజరు బ్రోకర్ అని భాజపా పార్టీ ప్రణాళిక బద్ధంగా లేదని, భాజపా రోజు రోజుకు ప్రజాదారణ కోల్పోతున్నదని, కేవలం కెసిఆర్ పాలన, కుటుంబ సభ్యులపై ఆరోపణ చేయడమే విధానంగా మారిందని, జాతీయ పార్టీగా స్పష్టమైన విధానం లేదని ఆరోపించారు. కుటుంబ పాలన కాదని, ప్రజల ద్వారా చట్టసభల్లోకి వచ్చారే తప్పా, నామినేటెడ్ పదవులతో మంత్రులు కాలేదని గుర్తు చేశారు. తెలంగాణ బద్ధ వ్యతిరేకి పార్టీగా బిజెపిని రాష్ట్ర ప్రజలు ఏ విధంగానైనా ఆహ్వానించరని బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ అంతకంత పెరుగుతుందని బిజెపి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని స్పష్టం చేశారు. నేటి కేటీఆర్ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కృతజ్ఞతగా కేటీఆర్ సభకు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎమ్మెల్యే రాజయ్య పిలుపు నిచ్చారు. సాగునీటి రంగంలో సృష్టికి ప్రతి సృష్టి చేసిన ఘనత కేసిఆర్ అని, ప్రజలే ప్రతి పక్షాలకు సరైన సమయంలో సమాధానం చెప్పే సమయం వస్తుందని ఆయన అన్నారు. జిల్లాలోని తరిగొప్పుల, చిల్పూర్ మండలంలోని శ్రీపతి పల్లి, కొండా పూర్, వంగాళపల్లి, నష్కల్, ధర్మసాగర్లోని పలు గ్రామాలకు ఎత్తిపోతల పథకం ఎంతో దోహదపడుతుందని జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి అన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజల మద్దతు కేసీఆర్ ప్రభుత్వానికి ఉందని నోటికి ఎంత వస్తే అంతగా ప్రతిపక్షా లు వాగుతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ బీసీ నాయ కుడిగా ప్రధాని మోడీ ఈ రాష్ట్ర లో బీసీలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వెంకన్న, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పోగుల సారంగపాణి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, నాయకులు పోలేపల్లి రంజిత్ రెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు, యాదగిరి, రాజ ేష్ నాయక్, గట్టయ్య, సర్పంచులు చంద్రయ్య, మల్లేశం, ఎంపిటిసిల ఫోరం అధ్య క్షుడు సింగపురం దయాకర్, యూత్ నాయకులు సాయి, పొన్న రాజేష్, గుండె మల్లేష్, గాదె రాజు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.