Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనుల భాషకు లిపి ఇవ్వాలి
- ఢిల్లీలో సేవాలాల్ మహారాజ్, కొమరం భీమ్ భవనాలను నిర్మించాలి
- గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- మరో సేవాలాల్గా సీఎం కేసీఆర్
- మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో గిరిజనులు అడుగడుగున అన్యాయానికే గురవు చున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆరోపించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సంత్ సేవాలాల్ మహారాజ్, మేరామా యాడి ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి కార్యక్రమంతో పాటు, సేవాలాల్ ఆలయ నిర్మా ణం, మేరామా యాడి ఆలయ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజలో చెందిన సేవాలాల్ మహారాజ్ పీఠాధిపతి బాపూ సింగ్ మహారాజ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్, జనగామ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బిందు, జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, జనగామ జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లతో కలిసి మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావులు పాల్గొని సేవాలాల్ జయంతితో పాటు, ఆల య నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సేవాలా ల్ మహారాజ్ ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రవి రాథోడ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు మాట్లా డుతూ ఆలయాల నిర్మాణాల పేరుతో మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూయిజం ముసుగులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని విమర్శిం చారు. భారతదేశంలో 15 కోట్ల మంది జనాభా కలిగిన గిరిజన భాషకు లిపి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదవ షెడ్యూల్ చేర్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో బిల్లు ప్రవేశపెట్టి గిరిజన భాషకు లిపి కేటాయించి గిరిజన భాషను జాతీయ భాషగా గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్ల కోసం రాజకీయాలు తప్ప గిరిజనుల సంక్షేమాన్ని నేటి బిజెపితో పాటు గత పాల కులు ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కషి చేస్తూ మరో సేవాలాల్గా అవతారమిత్తాడని అన్నారు.50 ఏళ్లుగా గిరిజనుల కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సింది పోయి, 200 కులాలను ఎస్టీ జాబి తాలో చేర్చారని విమర్శించారు. అవకాశవాదుల కుట్రలను తిప్పి కొట్టాలని గిరిజ నులకు మంత్రులు పిలుపునిచ్చారు. పాలకుర్తి ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉండటం 284 ఏళ్ల కిందట పుట్టిన సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి రెండు కోట్ల వ్యయంతో బీజం పడడం అభినందనీయమన్నారు. గిరిజనులకు పాల న సౌలభ్యం అందుబాటులో ఉండే విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మూడువేల 146 గిరిజన తండాలకు నూతన గ్రామపంచాయతీలనుఏర్పాటు చేశారని. గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం 6 వందల కోట్లను విడుదల చేశామని తెలిపారు. తండాల్లోని రోడ్లు మౌలిక వసతుల కోసం 20 కోట్లు మంజూరు చేస్తానని ఏప్రిల్ లో మరో 30 కోట్లు కేటాయిస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆలయ నిర్మాణానికి కోటి 50 లక్షలు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పాల కుర్తి ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని మహాకవులు ఇక్కడే జన్మించారని, ఈ ప్రాం తాన్ని టూరిజం ప్యాకేజీలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ 100 కోట్ల నిధులను మంజూరు చేసి పర్యాటక పనులు చురుగ్గా సాగుచున్నా యని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పండుగలకు గుర్తింపు దేశంలో తెలంగాణలో తప్ప మరెక్కడ లేదని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాదులో గల ట్యాంక్ బండ్ పై నిర్మించేందుకు మంత్రులు దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ సూచించారు. ఆయన బోధనలను ప్రభుత్వమే విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తా నుండి గిరిజన సాంప్రదాయ దుస్తులతో గిరిజన మహిళలు ఆట పాటలతో నత్యం చేస్తూ సేవాలా ల్ మందిర నిర్మాణ ప్రదేశానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ ఆలయ నిర్మాణ కమిటీ ఉద్యోగుల విభాగం నాయకులు ధారావతు కిషన్ నాయక్, గుగులోతు శంకర్ నాయక్, ధరావతు జై సింగ్ నాయక్, ధరావతు రామ్ సింగ్ నాయక్, ఆలయ నిర్మాణ కమిటీ సలహాదా రులు లావుడియా ఫుల్ సింగ్ నాయక్, ధరావత్ మోహన్ గాంధీ నాయక్, ఎంపీ పీ నల్ల నాగిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి, జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస రావు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు , జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, బిఆర్ఎస్ మం డల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు లావుడియా మల్లు నాయక్, దేవేందర్ నాయక్, మహేందర్ నాయక్, నాగరాజు నాయక్, లక్కావత్ వెంకట్ నాయక్‌లతోపాటు నియోజకవర్గంలోని గిరిజన ప్రజాప్రతినిధు లు, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.