Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
వైద్య పీజీ విద్యార్థిని ధారావత్ ప్రీతిని ర్యాగింగ్ చేసిన సైఫ్‌ను ఉరితీయాలని పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థి ప్రీతిపట్ల ర్యాగింగ్‌కు పాల్పడిన సైఫ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సంద్భంగా కొడకండ్ల మండల కాం గ్రెస్ అధ్యక్షుడు ధరవాత్ సురేష్ నాయక్,పాలకుర్తి మండల ఎస్టి సెల్ అధ్యక్షులు లావుడ్యా భాస్కర్నాయక్లతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ ర్యాగింగ్ పేద వర్గాలకు చెందిన అమ్మాయిలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధ్యులైన కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు, నిందితుని కఠినంగా శిక్షించాలని డి మాండ్ చేశారు. ర్యాగింగ్‌కు గురైన ప్రీతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్ఓడి లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్వోడీలను సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూక్య శ్రీనివాస్, లాకావత్ రవి నాయక్, కునుసోత్ రవి నాయక్, జాటోత్ రాము, దారావత్ హేమాన్, జాటోతు సిద్ధూ, ధరావత్ హరి చందర్, బానోత్ అనిల్ కుమార్, ధారావత్ తిరుపతి, లాకావత్ తిరుపతి, హతీ రాం, ఎడవల్లి సోంమల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.