Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణంలో తొలగింపు-కలెక్టరేట్లో మినహాయింపు
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
తుగ్లక్ చర్యలకు ప్రతీ రూపకంగాను, పక్షులు సైతం వాలని చెట్లుగా సాధారణ ప్రజలు చెప్పుకుం టున్న కోనోకార్పస్ చెట్లు జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ లో ఏపుగా పెరుగుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల ను సైతం తట్టుకొని నిలపడుతాయని గతంలో పట్ట ణమంతా కోనోకార్పస్ మొక్కలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నాటించారు. అంతే కాకుండా రహదారు ల వెంట, గ్రామ పంచాయతీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ అవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఏమి జరి గిందో ఏమో కాని ఈ చెట్ల వల్ల మంచి కంటే మానవ మనుగడకు చెడే ఎక్కువగా జరుగుతుందనేది ప్రచా రంలోకి వచ్చింది.దీంతోపట్టణంలో చౌరస్తాలో నాలు గు వైపుల నాటిన ఈ మొక్కలను మున్సిపాలిటీ ఆధ్వ ర్యంలో తొలగించారు. కోనోకార్పస్ మొక్కల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వ్యాపిస్తాయనే కారణంగా వాటిని నిర్మూలించినా ఇంకా అక్కడక్కడ మనకు దర్శ నమిస్తూనే ఉన్నాయి. కాని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ చెట్లు ఏపుగా పెరిగి చూపరుల కు దర్శనమిస్తున్నాయి. పక్షులు సైతం వాలని చెట్లు గా సాధారణ ప్రజలు పిలుచుకునే ఈ ప్రమాదకర మైన చెట్లను కలెక్టరేట్లో ఎందుకు తొలగించడం లే దోనని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చెట్ల ను తొలగించమని చెప్పిన ప్రభుత్వం నర్సరీల్లో వీటి పెంపకాన్ని మాత్రం నిషేధించాలని ఎలాంటి ఉత్త ర్వులు జారీ చేయకపోవడం గమనార్హం.
ప్రభుత్వానిది తుగ్లక్ చర్యలు : సింగారపు రమేష్
సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు, జనగామ
మానవ మనుగడకు మొక్క లు మంచివే అయినప్పుడు ప్రభుత్వం సిఫారసు చేసి పెం చిన మొక్కలను తొలగించడం తుగ్లక్ చర్చ. కోనోకార్పస్ అనే చెట్లు ప్రజల ఆరోగ్యానికి హానికర మన్నప్పుడు వాటిని పెంచకపోవడమే బాగుండేది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే వాటిని మున్సిపాలిటీలో పెరిగిన తరువాత తొలగించడం తుగ్లక్ చర్యను మరిపిస్తుంది. పట్టణంలో తొలగించిన మొక్కలు కలెక్టరేట్లో పెంచుతుండడం పట్ల ప్రజలు ఏ విధంగా అర్ధం చేసుకోవాలో జిల్లా పాలకులు వివరించాల్సి ఉంటుంది.