Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పెదగాని సోమయ్య గౌడ్, పాకనాటి దామోదర్ రెడ్డి, లేగా రాంమోహన్ రెడ్డి అన్నారు. ప్రజా గోస-బీజేపి భరోసా యాత్రలో భాగంగా ఆదివారం మండల పరి ధిలోని రొట్లబండ తండాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగి న గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు, జిల్లా కార్యదర్శి సాయిని ఝాన్సీ, మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన సుధాకర్, తళారి సోమయ్య, అనిల్, కోట కుమార్, సూక్య, తదితరులు పాల్గొన్నారు.