Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
మండలంలోని గణేష్కుంట తండాలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఆది వారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మొదటి రెండురోజులు ప్రత్యేక పూజలు చేసి మూడో రోజు వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. గ్రామస్తుల బంధువులు, ఆడ పడుచులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మూడురోజులు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బోనాలు వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్ కుటుంబ సమేతం గా బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొని ముందుండి కార్యక్రమాన్ని విజవంతం చేశారు.