Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మాదిగ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐలయ్య
నవతెలంగాణ-తొర్రూరు
ఉపాధ్యాయ ప్రమోషన్ల విష యంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సిన వాటా విష యంలో ఆటంకిగా మారిన అడక్కసి అనే పదాన్ని వెంటనే తొలగించాలని తెలంగాణ మాదిగ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమారపు ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆది వారం మాదిగ ఉద్యోగ సమాఖ్య ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డివిజన్ బాధ్యు ల సమావేశం స్థానిక అతిథి గహంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఐలయ్య పాల్గొ ని మాట్లాడారు. జీవో ఎంఎస్ నెంబర్ 2, 2003, జీవోఎంస్నెంబర్ 18, 2005 లలో అడక్కసి అనే పదాన్ని తీసుకొని వచ్చి, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యా యులు సరిపడ ఉన్నారని అనే తప్పుడు సంకేతంతో, అగ్రవర్ణ మనువాద సంఘా ల మాటవిని, ప్రమోషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు 2005 నుండి అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అడక్కసీ అనే పదాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉపాధ్యాయులందరిని సిద్ధం చేస్తామని హెచ్చరించారు. మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆడక్కసి రద్దు పోరాటంలో కలిసి రావాలని పిలుపు నిచ్చారు. అనంతరంఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చా గంటి ప్రభాకర్ మాట్లాడుతూ ఆడకేసీ అనే పదం ఉండడం వలన ఓపెన్ క్యాటగి రీలో ఎంపిక కాబడిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను ప్రమోషన్ల విషయంలో మా త్రం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను రాష్ట్రంలోకి తీసుకొని రావడం వలన మెరిట్ తక్కువగా ఉన్న, వెనక ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరు గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఆడక్యసి అనే పదం వలన 75శాతం ఖాళీలను ఓసీలు, బీసీలు పంచుకునే విధంగా, ఎస్సీ, ఎస్టీలను రానీకుండా చేస్తున్నారని ఇది రా జ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అన్నారు. అందువలన అడక్కేసి అనే పదాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగ సమైక్య, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తొర్రూర్ డివిజన్ బాధ్యులు గుండాల రంజిత్, టీ.రా యలు, దండ్రే నరస య్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.