Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థినిపై ర్యా గింగ్కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థి సైఫ్‌ను ర్యాగింగ్ నిరోధక చట్టం క్రింద వెంటనే శిక్షించాలని తెలంగాణ గిరిజన సంఘం మండల కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు. స్దానిక మంగపతిరావు భవనంలో ఆదివారం జరిగిన తెలం గాణ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరినాయక్ మాట్లాడు తూ కేఎంసీలో పిజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి అనే విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తూ సీనియర్ విద్యార్థులు తీవ్రమైన చిత్రహింసలకు పాల్ప డ్డారని దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన జూనియర్ విద్యార్థిని ఆత్మహత్యాయ త్నం చేసుకునే విధంగా ఇబ్బందులకు గురి చేయడం దారుణ మని విచారం వ్య క్తం చేశారు. ఇలాంటి చర్యలకు పదేపదే పాల్పడుతున్న సీనియర్ విద్యార్థులకు కనీసం ప్రిన్సిపల్ ర్యాగింగ్ చట్టాలపై అవగాహన కల్పించడం, మందలించడం వంటి చర్యలు చేపట్టకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ పై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా ర్యాగింగ్ ఘటనలు పెరిగిపో తున్నాయని ర్యాగింగ్ రక్కసిని ఎదుర్కొనేందుకు చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చట్టాలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరా రు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండాచట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గిరిజన సం ఘం మండల అధ్యక్షుడు మాలోత్ శాంతి కుమార్, నాయకులు భూక్య పుల్ సింగ్, లకావత్ శ్రీను, గుగులోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.