Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి - సీఐటీయూలో భారీ చేరికలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడేది సిఐటియు మాత్ర మేనని ఆసంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. ఆది వారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డుల సంఘం అధ్యక్షుడు మా సాని భాస్కర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు లు భారీ సంఖ్యలో సిఐటియులో చేరారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.సాగర్, ముక్కెర రామస్వామి జిల్లా సహాయ కార్యదర్శులు అక్కనపెల్లి యాదగిరి, తుమ్మల సాంబయ్యలు సెక్యూరిటీ గార్డులకు సిఐటియు జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రామ స్వామి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. వ్యవసాయ మార్కెట్లలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు జీవో నంబర్ 21 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, మార్కెట్ కమిటీల నుండే జీతాలు చెల్లించే విధంగా చూడాలన్నారు. ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపడుతున్న కార్మిక కర్షక సంఘర్షణ ర్యాలీ ధర్నా కార్యక్రమానికి సెక్యూరిటీ గార్డు లు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు నిచ్చారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
సమావేశానంతరం వరంగల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా అక్కనపెల్లి యాదగిరి అధ్యక్షునిగా సింగారపు యాకయ్య, కార్యదర్శి గా మెరుగు యాకయ్య, కోశాధికారిగా ఎండి యాకూబ్ అలీ, ఉపాధ్యక్షులుగా యాకయ్య, సందీప్ కుమార్, సహాయ కార్యదర్శిగా చిర్ర యాకూబ్, శ్రీనివాస్ సభ్యులుగా రవీందర్, రాజు, రేణుకలు ఎన్నికయ్యారు.