Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర నాయకులు పెదగాని సోమయ్య
నవతెలంగాణ-తొర్రూరు
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు, పాలకుర్తి నియోజకవర్గం ఇం చార్జ్ పెదగాని సోమయ్య అన్నారు. ఆదివారంప్రజా గోస-బీజేపి భరోసా యాత్ర లో బాగంగా స్థానిక భీరప్ప నగర్లో శక్తి కేంద్రం ఇంఛార్జి శివసాయి ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రా ష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య ముఖ్య అతిథిగా హాజ రై ప్రసంగించారు. భారత్‌ను విశ్వ గురువు స్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేం ద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.పేదల కష్టాలను స్వయంగా అనుభవించిన వ్యక్తిగా తనలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.పేదలకు అండా బీజేపీ జెండా అని తెలిపారు.ప్రతీ పేదవారికి కార్పోరేట్ వైద్యం అందించేలా ఆయుష్మాన్ భారత్ పథకం రూపొందించి ప్రజారోగ్యం పట్ల నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు.మోడీనాయకత్వంలో భారత్ అత్యంత సురక్షితంగా, సుభిక్షంగా ఉందని ఆయన నాయకత్వం ఈదేశానికి శ్రీరామ రక్ష అని కొనియాడారు.కరోనా విపత్తు వేళా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా, అన్ని రంగాల్లో పూర్తిగా దెబ్బతిన్న దుర్బర పరిస్థితిలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా నివారణ వ్యాక్సిన్ అందించి అందరికీ భార త్ అండగా ఉంటుందని భరోసా కల్పించిన ఘనత మోడీకి దక్కింది అని తెలి పారు. బీజేపీ భరోసా యాత్ర, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేయడం జరి గిందని తెలిపారు.ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేస్తున్నారని, తమ కష్టాలను తెలియజేస్తూ బీజేపీకి ఉంటాం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కేసిఆర్ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పి బీజేపీని బలపరుస్తారని, రాష్ట్రంలో బీజేపీ కమలం జెండా ఎగు రడం ఖాయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాక నాటి దామోదర్ రెడ్డి, తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, ప్రధాన కార్యదర్శి పైండ్ల రాజేష్, బూత్ అధ్యక్షులు ఉల్లెంగుల రాజేష్, నాయకులు వడ్లకొండ రవి, ఎనగందుల శ్రవన్ తదితరులు పాల్గొన్నారు.