Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
రాయపర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూ జల కలకలంతో స్థానిక ప్రజలు భయాందో ళనకు గురవుతున్నారు. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. మండల కేంద్రా నికి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి గత రెం డు నెలల క్రితం మృతి చెందగా మండల కేంద్రం శివారు బతుకమ్మ కుంట ప్రాంతం లో ఖనణం చేశారు. కాగా గత మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి సమాధిపై కొంత మేరకు మట్టిని తొలగించి పసుపు, కుంకుమలు మనిషి రూపంలో ఉండే బొమ్మ, వివిధ వస్తువులతో అక్కడ పూజలు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆదివారం బయటికి రావడంతో స్థానిక కుటుంబ సభ్యులతో పాటు పంట పొలాలకు వెళ్లే రైతులు, బతుకమ్మకుంట శివారు కార్కనావాడ ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకోలేదని, ఇక ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.