Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఇసుక క్వారీలో తాడుకట్టు,లారీలలో ఇసుక నేర్పుడు తదితర పనుల్లో తమకు ఉపాధి కల్పించాలని మల్లారం గ్రామపరిధిలోని రావులపల్లిలో ఆదివారం ప్రధాన రహదారిపై నాయకపోడు, ఆదివాసీ గిరిజనులు 50మంది ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు మల్లారం గ్రామంలో రెండు ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకటి మల్లారం, మరొక్కటి రావుల పల్లి గ్రామస్తులకు ఇచ్చి నిర్వాహకులు ఉపాది కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో మల్లారం గ్రా మస్తులు తమకు సహకరించకుండా తాము అమాయక గిరిజనులమని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు క్వారీలో ఒక క్వారీని తమను ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇసుక క్వారీలు నిర్వహించడంతో రాత్రి,పగలు లారీల చప్పుడు,దుమ్ము, దూలితో తాము ఇబ్బందులకు గురువుతున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా తమ ఊరికి వేరుగా ఒక క్వారీ కేటాయించి ఉపాధి చూపాలని విజ్ఞప్తి చేశారు.