Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజా నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు పై అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని కాం గ్రెస్ నాయకులు విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లా డుతూ.. గత శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. గండ్ర సత్యనారాయణ రావు సర్పంచిగా జడ్పి టిసిగా గెలిచినప్పటి నుండి ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచు కుంటున్నారని అన్నారు. అలాంటి నాయకుడిపై లేనిపోని నిందలు మోపుతూ బీఆర్ ఎస్ నాయకులు పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. భూపాల పల్లి నియోజకవర్గం లో ఉన్న ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తున్నారన్నారు. భూపా లపల్లిలో 30 సంవత్సరాల నుండి ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజాభిమా నాలు పొందుతూ కొన్ని వేల మందికి అండగ ఉన్నారన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తో పాటు అనుచరులు అవినీతి అక్రమాలకు పాల్ప డుతూ భూకబ్జాలు చేస్తుంది నిజం కాదా అని ప్రశ్నిం చారు. జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి నాలుగు కోట్లు ఖర్చుపెట్టి మంత్రి తారక రామా రావును ఆహ్వానించినంత మాత్రాన మీపై మంచి అభిప్రాయం ప్రజలకు లేదని తెలిపారు. ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వచ్చి సర్వే నబర్ 207, 208 లోని మా భూమి కబ్జాకు గురిచేసి బెదిరించి భూమి లాక్కుంటున్నాడని చెప్పి ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసింది నిజం కాదా అని ప్రశ్నిం చారు. ప్రజలు రాబోయే రోజులలో బీఆర్ఎస్కు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వార న్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికిస్తు న్నారు? మీ నాయకులకు మీ కార్యకర్తలకు మీ లీడర్లకే తప్ప ఏ ఒక్క ఊరిలో ఒక నిరుపేద కుటుం బానికి ఇచ్చినట్టు దాఖలు లేవని ఆరోపించారు వీటిపై మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా మని, టైం డేటు ప్రకటించి బహిరంగ చర్చలో పాల్గొ నాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అంబాల శ్రీనివాస్, ఉడత మహేందర్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.