Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రమేష్
- సింగరేణి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్(ఎఐటియుసి) నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-భూపాలపల్లి
ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు సాధించబడతాయని ఏఐటియుసి బ్రాంచ్ కార్య దర్శి మోట పలుకుల రమేష్ అన్నారు . ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొమ రయ్య భవన్లో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూ నియన్ బ్రాంచ్ మహాసభ కుడుదుల వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మోట పలుకుల రమేష్. క్యాతరాజు సతీష్ పాల్గొని మాట్లాడారు. కార్మిక వర్గం కోసం కార్మికులందరినీ ఐక్యం చేసి ఐక్య ఉద్యమాల ధార కార్మిక హక్కులు సాధించుకునే దిశగా కార్మికు లందరూ సంఘాలు నిర్మించుకొని పోరాటాలు నిర్వహించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఎర్రజెండా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మార్చి 5వ తేదీన సింగరేణి వ్యాపితంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరూ భూపాలపల్లి లో జరిగే రాష్ట్ర మహాసభలను జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన బ్రాంచి కమిటీ ఎన్నుకున్నారు. బ్రాంచి గౌరవ అధ్యక్షు లుగా గంగ సారపు శ్రీనివాస్, అధ్యక్షులుగా సెగ్గం ర రాజేష్,బ్రాంచ్ కార్యదర్శిగా కుడుదుల వెంకటేష్, బ్రాంచి సహాయ కార్యదర్శిలుగా భార్గవ్, కె. శంకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె రమేష్, వెంకటలక్ష్మి,కోశాధికారిగా ప్రేమ్ సాగర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బి రవి, శారద, కె మల్లేష్, రవికుమార్,భాస్కర్ దేవేందర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వనిత, అనూష, స్వరూప, రాజేందర్,కుమార్ మల్లేష్, భార్గవ్, కష్ణ తదితరులు పాల్గొన్నారు.