Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మహనీయులను స్మరించుకోవాలని సెయింట్ అంతోనీ విచారణ ఫాదర్ కే జోసెఫ్ అన్నారు. మండల కేంద్రంలోని సెయింట్ ఆంటోని చర్చి ఆవరణంలో అభ్యుదయ ఆర్ట్ అకాడమీ హైదరాబాద్ వారిచే, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంగం శరణం గచ్చామి అనే దృశ్య రూపక నాటిక ప్రదర్శనను ప్రజా సంఘాల వేదిక వేల్పుల రవి, ఇసంపల్లి రమేష్, బొల్లం సాంబరాజు ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ తెలు సుకొని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. నేడు భారత రాజ్యాంగాన్ని రూపుమాపాలని కొం దరు అభిప్రాయాలు పడుతున్నారని, అలా జరిగితే బడుగు బలహీన వర్గాలకు ప్రమాదం ఏర్పడు తుందని హెచ్చరించారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ ఎం జగ్గారాజు మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక, సామాజిక న్యాయం, బహు జనుల రాజ్యాధికారం కోసం అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని అన్నారు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో భారతరాజ్యాంగాన్ని, కాపాడుకో వాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ బొడ్డు వసంత కుమార్, పాస్టర్ గంగారపు కమలాకర్, బొడ్డు ప్రభుదాస్,గుర్రపు రాజేంద్రప్రసాద్,గంటే సదయ్య, శ్రీరాముల విజరు,సంఘ పెద్దలు మాచర్ల ప్రవీణ్,బొడ్డు సురేందర్,నక్క ప్రవీణ్ ,జర్నలిస్టుల సంఘం నేతలు పొడిశెట్టి కరుణాకర్,రాఘవులు, జై భీమ్ ఫౌండేషన్ సంఘం సభ్యులు, రోజా,సంధ్య, ఉద్యోగులు, విద్యార్థులు, సామాజిక సంఘాలు, అభ్యుదయ వాదులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.