Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
ఈనెల 28న భూపాలపల్లిలో టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టబోయే హాథ్ సే హాథ్ జోడో యాత్రలో వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మండల అద్యక్షులు రేపాక రాజేందర్ అధ్యక్షతన జోడో యాత్ర సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 28న భూపాలపల్లి పట్టణానికి రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రానున్నారని తెలిపారు. సోమవారం రాత్రి కాసింపల్లిలో బస చేసి, మంగళవారం యాత్ర కాసింపల్లి నుండి యాత్ర ప్రారంభించి, సెగ్గంపల్లి, జంగేడు, రాంనగర్, ఎల్.బి నగర్, లక్ష్మీనగర్, రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా అంబేడ్కర్ సెంటర్ కు చేరుకుంటుందని, అక్కడ సాయంత్రం జరిగే పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక శంకర్, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, కో ఆప్షన్ సభ్యులు యండి చోటేమియా, ఎంపీటీసీ కాలియా సాగర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువన సుందర్, గణపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కష్ణ, మాదం మమత సుధాకర్, ఓద్దుల విజయ అశోక్ రెడ్డి, గుర్రం సదానందం, దూడపాక దుర్గయ్య, పోశాల మహేష్, లతో పాటు అన్ని గ్రామాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.