Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్ధు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణిసిద్ధు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మొట్ట మొదటి సారిగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు డిస్ట్రిక్ తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లోజు దిలీప్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా తైక్వాండో చైర్మన్ గండ్ర హరీశ్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించి మాట్లా డారు. మహిళల రక్షణకు ప్రతి ఒక్క మహిళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు. అనంతరం జిల్లా తైక్వాండో చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. మొట్టమొదటిసారి భూపా లపల్లి జిల్లాలో జిల్లాస్థాయి తైక్వాండో పోటీలను ప్రారంభించడం గొప్ప విష యమని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి సహకారంతో జయ శంకర్ భూపాలపల్లి జిల్లా తైక్వాండో అసోసియేషన్ ద్వారా విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత పొందేలా అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం క్రీడాకారులు పలు విన్యాసాలు చేశారు. సుమారు వందమంది క్రీడాకారులు తైక్వాండో పోటీలలో పాల్గొన్నారు. థారు కాండో పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, శీల్డులు, మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా థైక్యాండో వైస్ చైర్మన్ ఇళ్ల ఆదినారాయణ, జనరల్ సెక్రెటరీ కొమ్ముల శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ పొలవేని మహేందర్, జిల్లా టెక్నికల్ రిఫరీలు తిరుపతి, రాం బాబు, రజినీ కాంత్, రాగిణి ప్రియ, వెంకటేష్, దేవేందర్, మోహన్, శ్రీపాల్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.