Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి ఉప సభాపతి బండా ప్రకాష్
- గ్రామాల్లో మహిళ భవన నిర్మాణానికి కృషి
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ - నడికూడ
దేశానికే ఆదర్శంగా బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచాయని శాసనమండలి ఉప సభాపతి బండా ప్రకాష్, ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో మహిళ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన అలాగే రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనాన్ని ప్రారభించారు. మొదటగా గ్రామానికి వచ్చిన శాసనమండలి ఉప సభాపతికి, ఎమ్మేల్యే ధర్మారెడ్డికి గ్రామస్థులు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్ళతో ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. వాగు వద్దనుండి సభా స్థలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అన్ని రంగాల్లో అభివద్ధి చెందాయని. తండా లను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆ ర్దేనని అన్నారు. నియోజకర్గంలో అన్ని గ్రామాలలో మహిళ భవనాల నిర్మాణానికి కషి చేస్తామన్నారు. ఒక్క కంఠాత్మకూరు గ్రామంలో రూ.2కోట్లకు పైగా నిధులతో అభివద్ధి పనులు జరిగి నట్లు తెలిపారు. గ్రామస్థుల చిరకాల కోరికైన బ్రిడ్జి నిర్మాణంకి రూ.7కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం చేసుకోబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమానికి సిఎం కేసీఆర్ కషిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల అభివద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులైన కేటాయించడానికి సిద్దంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ రూ.1కోటితో పలు అభివద్ది పను లకు శంఖుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన విషయమ న్నారు. వేల కోట్ల రూపాయల వెచ్చించి రాష్ట్రాభివద్ధికి సిఎం కేసీ ఆర్ కషిచేస్తున్నారని, వారికి మద్దతుగా అందరూ నిలవాలన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి 50 శాతం రిజర్వే షన్ కల్పించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. ఎంపీపీ మచ్చా అనసూర్య రవీందర్, జడ్పిటిసి సుమలత కరుణాకర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ బిక్షపతి, బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి లింగాల తిరుపతి, పిఎసిఎస్ చైర్మన్ లింగమూర్తి, సర్పంచ్ రేగుల సతీష్, ఎంపిటిసి లావణ్య రాజు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సుదాటి వెంకన్న, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.