Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లా కేంద్ర కార్యాలయాలు తక్షణమే నిర్మిం చాలని ఎంసీపీఐ(యు) వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్ అన్నారు. సోమవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఎంసీపీఐ (యు) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్ర కార్యాలయాలను తక్షణమే నిర్మించి గత ఎన్నికల హామీలను అమలు చేయాలని ఖిలా వరంగల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుటధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.ఈ ధ ర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించిన కేసీ ఆర్ ప్రభుత్వం వరంగల్ జిల్లాకు జిల్లా కేంద్రాన్ని సైతం ని ర్మించి ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వరంగల్ జిల్లాలో బసచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ఆచర ణలో విస్మరించారని జిల్లాలో ఏఒక్కరికి కొత్తగా ఇంటి స్థలా లు ఇల్లు నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవని పారిశ్రామిక అభి వృద్ధికి టెక్స్టైల్ పార్క్ ప్రారంభించిన ఇంతవరకు అతీగతీ లేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంసైతం జిల్లాకు చేసింది ఏమీ లేదని ప్రచార ఆర్భాటంతో మతోన్మాద విభజనకు ప్రయత్నిస్తుం దని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేదలు తెలం గాణ రాష్ట్రం రాకముందు ఇంటి స్థలాల కోసం గుడిసెలు వేసుకున్న వారికి నేటికీ జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం ఆన్నారు. ఇప్పటికై నా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా సమగ్ర అభివద్ధి కో సం ప్రత్యేక ప్రణాళికలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశా రు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ సమా వేశంలో పార్టీ నగర నాయకులు ఐటెం నాగే ష్, మాలి ప్రభాకర్ ,అప్పన్నపూరి నరసయ్య, గోరంట్ల శరత్ కుమార్, జటబోయిన నరసయ్య, రాయినేని ఐలయ్య, నలి వేల రవి తదితరులు పాల్గొన్నారు.