Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని, జాగ్రత్తతో మెలగడంవల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ సబ్ఇన్స్పెక్టర్ కంచి విద్యాసాగర్ అన్నారు. నరేం ద్రనగర్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల కాశీబుగ్గలో దాదాపు 500మంది విద్యా ర్థులకు సైబర్‌నేరాలు, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయి త్యాల పట్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్‌టచ్, ఈవ్ టీజింగ్‌పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్ లాంటి సోషల్ మీ డియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నే రాలపై అవగాహన కలిగిఉండాలన్నారు. విద్యార్ధులు ఎవరి నుండైన ఇబ్బందుల కు గురైనప్పుడు, ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లైతే ధైర్యంగా షీ టీమ్ వారికి సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేసిన వివరాలను గో ప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి చర్య తీసుకుంటామన్నారు. విద్యా ర్థులు సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఉపాధ్యాయు లతో పంచుకోవా లని అలా పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలో నివారించవచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేటి కాలంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తులతో ఎ లాంటి విషయాలను, ఫోన్ నంబర్లను, ఫోటోలను షేర్ చేసుకోవద్దని, సోషల్ మీ డియాలో పరిచయమైన వారితో ఎలాంటి వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవ ద్దని, ప్రేమ పేరుతో వాళ్లు చెప్పే మాటలను నమ్మి తల్లిదండ్రు లకు తెలుపకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు రాలు అరుణ, షీటీమ్ కానిస్టేబుల్స్ వంశీ,మహిళ కానిస్టేబుల్ పూర్ణ పాల్గొన్నారు.