Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
ప్రజా సమస్యలను పరిష్కారం కావడం లేదని పలువురు వినతి దా రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం సమా వేశ మందిరంలో సోమవారం నిర్వ హించిన ప్రజావాణిలో బల్దియాలోని పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 60 ఫిర్యాదులు రాగా ఇంజనీరింగ్ విభాగం 13, టౌన్ ప్లా నింగ్ విభాగం 34, పన్నుల విభాగం 03, ప్రజారోగ్య, శానిటేషన్ విభాగం.06, నీటి సరఫరా విభాగం 03, హర్టికల్టర్ విభాగం 01వినతులను స్వీకరించారు. 100 ఫీట్లరోడ్డు శ్రీనివాసకాలనీ ఏనుమాముల అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలు లేక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక అభివృద్ధి కమిటీ వి నతిపత్రం అందజేసింది. 3వ డివిజన్ పైడిపల్లి మధ్యగూడెం రోడ్లు డ్రైనేజీలు లే క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,హన్మకొండ పోచమ్మ కుంటలోని సగర కాలనీలో గత రెండేళ్లుగా తాగునీరురాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కడిపి కొండ దళితుల స్మశాన వాటికలో లైట్లు,నీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు కే.రావు,ప్రవీణ్ చంద్ర, సిఎం హెచ్ఓ డాక్టర్రాజేష్, సీహెచ్ఓ శ్రీనివాసరావు, సెక్రటరీ విజయలక్ష్మి ,బయల జిస్ట్ మాధవరెడ్డి, డిప్యూటీ కమిషనర్ జోనా, ఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.