Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చ దువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించాలని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బుధరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు -మనబడి ప్రణాళికలో భాగంగా చేసిన పనులను వారు ప్రారంభించారు. అనం తరం వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో మ న ఊరు మనబడి కార్యక్రమాన్ని రూపొందించి పల్లెలలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో పేదవర్గాలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. నర్సంపేట నియోజకవర్గం లోనే మొట్ట మొదటిగా మనఊరు-మనబడి ప్రణాళికలోని పనులను నిర్ణయించిన సమయా నుసారంగా అన్నివసతుల కల్పనతో, ఎక్కువ నిధులతో బుధరావుపేట గ్రామంలో పూర్తిచేసుకున్నామన్నారు. మొత్తం పాఠశాలకు కేటాయించిన నిధులు రూ.45 లక్షలతో పాఠశాలలకు అవసరమైన ప్రహరీగోడ, మంచినీటి సరఫరా, మరుగు దొ డ్లు, విద్యుత్, వంట గదులు, విద్యార్థులకు భోజనం చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకొవడానికి వాష్బేషన్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. బుధరావుపేట గ్రా మానికి ఎన్నో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివద్ధి పథంలో నడిపిస్తు న్నామన్నారు. అనంతరం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటరామ నరసయ్య గ్రామానికి సిసి రోడ్లు కావాలని, మహిళా సమైక్య ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరగా సానుకూలంగా స్పందించి మంజూరి ఇప్పిస్తామని అన్నారు.