Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం రంగశాయిపేట ఏరియా కమిటి కార్యదర్శి మాలోతుసాగర్
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మం డల పరిధిలోని ప్రభుత్వ భూములు జక్క లోద్ది, బెస్తంచెరువులో గుడిసెలు వేసుకొ ని నిరుపేద ప్రజలు గత 10 మాసాలు గా నివాసం ఉంటున్నారని వారికి జీవో 58 ప్రకారం క్రమబదీ కరించి మౌలిక స దుపాయాలు కల్పించాలని సీపీఐ(ఎం) రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యద ర్శి మాలోతు సాగర్ ఆధ్వర్యంలో సీపీఐ (ఎం) టీంతో కలసి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి కి వినతి పత్రం అందజేశారు. అంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు అ వుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే మి గిలి పోయాయన్నారు. రెండుపడక గదులఇల్లు కట్టి స్తాని చెప్పి ప్రజలను గాలికి వొదిలేసారని నగరంలో చాలా కుటుంబాలు ఇంటి అద్దెలు కట్టలేక ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని జీవనం సాగి స్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లస్థలాలు ఇచ్చి పక్కాఇల్లు కట్టించి మౌలిక సదుపాయా లు కల్పిచాలన్నారు. కలెక్టర్ జోక్యం చేసు కొని పేదలు వేసుకున్న గుడిసెలకు వస తులు కల్పించాలని కలెక్టర్ బి.గోపిని కోరి నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో సిపిఐ (ఎం) రంగశాయిపేట ఏరియా కమిటీ స భ్యులు మాలోతు ప్రత్యుష, గణేపాక ఓదె లు, సింగారపుదాసు, జ్యోతి, సోషల్ మీ డియా కార్యదర్శి గజ్జచందు, సందీప్,ఇస్సాంపెల్లి స తీష్, శాఖ కార్యదర్శులు కలకోట శ్యామ్, కోటేశ్వర్, శా గంటి ప్రభాకర్, అల్లాడి యాకయ్య, కలకోటి విజరు కుమార్, భూక్య విజయ్ తదితరులు పాల్గొన్నారు.