Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
మండలంలోని తిరుమలా యపల్లి గ్రామంలోని చారిత్ర,క శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి బీఆర్ ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి రూ.1,25,116 లు విరాళాన్ని అందజేశారు. సోమ వారం బిల్లా సుధీర్‌రెడ్డి-ఉషశ్రీ దంపతులు ఆలయానికి హాజరుకాటగా ఆలయ అర్చకులు పూర్ణకుంభం, పూలమాలలతో ఘనస్వాగతంపలికారు.ఈసందర్భంగా ఆలయంలో సుధీర్‌రెడ్డి దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం బిల్లా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల పునఃప్రతిష్ఠకు కృషి చే స్తుందని తెలిపారు. ప్రతిఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని పేర్కొన్నారు. మానవ జీవితంలో ఒడిదుడుకులు సహజం మనసును ప్రశాంతంగా ఉంచుకోని భగవధ్యానం చేస్తే అశాంతి దూరమవుతుంది అని హితబోధ చేశారు. ఆధ్యాత్మిక చింతన అనేది శ్రీరామరక్షగా ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాక ర్రావు సహకారంతో గ్రామాల్లోని చరిత్రకమైన ఆలయాలకు పూర్వ వైభవం వస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గజవెల్లి అనంతప్రసాద్, గ్రామ ప్రముఖులు జి నుగు నరసింహారెడ్డి, సోమిరెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, గ్రామ రైతు బంధు కన్వీనర్ గుడి మహబూబ్‌రెడ్డి, ఉపసర్పంచ్ గుడి యుగేందర్ రెడ్డి, గజవెల్లి రామ శేఖర్, ఎల్లగౌడ్, గూగులోతు రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.