Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంచం తీసుకుంటూ పట్టుబడిన సర్వేయర్
- అవినీతి ముసుగులోరెవెన్యూ శాఖ
- ఏసీబీ దాడులతో ప్రభుత్వ శాఖల్లో కలకలం
నవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటిడిఏ
గత కొద్ది రోజుల క్రితం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల సంఘటన మరువకముందే సోమ వారం రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. తహశీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సర్వేయర్ బొచ్చు మహేందర్ రైతు వద్ద రూ. 10వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడ్డాడు. కాగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. గత నెలలో ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖలో ఇద్దరు ఇంజనీర్లు ఏసీ బీ చిక్కారు. నెలలోపు మరో అవినీతి అధికారి చిక్కడంతో ఏటూరునాగారం ఏజెన్సీలో అవినీతి అక్రమాల బాగోతం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏసీబీ ఇన్చార్జీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం. ఏటూ రునాగారం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి మనోమర్రావుకు చెందిన 30 ఎకరాల వ్యవసాయ భూమి మండలంలోని కోయగూడ ఎల్లాపూర్, రామన్నగూడెం, ఏటూరునాగారం శివారు ప్రాంతాల్లో ఉంది. ఇందులో అతని కూతురికి 5.34 ఎకరాల భూమి ఇచ్చాడు. ఆ భూమిని పక్కన ఉన్న రైతులు ఆక్రమించుకున్నారని సర్వే చేయాలని గతేడాది మేలో మీసేవాలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పడు సర్వే చేసి న రెవెన్యూ అధికారులు హద్దులు పెట్టకుండా వదిలేశారు. అనంతరం మనోహర్‌రావు అమెరికా వెళ్లిపోయాడు. ఆ తర్వాత జనవరిలో వచ్చిన మనోహర్ తన కుమార్తెకు ఇచ్చిన భూమిని పక్క రైతులు మళ్లీ ఆక్రమిం చుకున్నారని సర్వే చేయాలని మీసేవలో ధరకాస్తు చేసుకు న్నాడు. తహశీల్దార్ కార్యాలయం, సర్వేయర్‌ను పదేపదే వేడుకు న్నా సర్వే చేయలేదు. ఈక్రమంలో సర్వేయర్ బొచ్చు మహేం దర్‌ను కలవగా రూ. 10వేలు ఇవ్వా లని ఒప్పందం కుదు ర్చుకున్నాడు. సోమవారం మండలం లోని కోయగూడ-ఎల్లాపూర్ గ్రామ శివారు భూ ములను సర్వే చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలోని తాళ్లగడ్డ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో రూ.10వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ నెల 4న ఏసీబీకి మనోహర్ రావు ఫిర్యాదు చేశాడని, రెక్కీ నిర్వహిం చి సర్వేయర్‌ను పట్టుకున్నామని, నేడు కోర్టులో రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ విభాగం బీరువా, అతని వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి కార్యాల యంలో తనిఖీలు చేపట్టారు. నెలన్నర రోజుల్లోనే రెండు సార్లు ఏసీబీ దాడులు జరగడంతో అవినీతి అధికారుల గుండెల్లో అలజడి మొదలైంది. ఏసీబీ దాడుల్లో సీఐ శ్యాం, శ్రీను, రవి పాల్గొన్నారు.