Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
అంధత్వ రహిత తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటివెలుగు పేదలకు వరం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి 11వ వార్డు వేశాలపల్లి గ్రామంలో బస్తి బాట కార్యక్రమంలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 11వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైడ్ డ్రెయిన్ల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తే సైడ్ డ్రెయి న్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేశాలపల్లి నుండి పుల్లురి రామయ్య పల్లి గ్రామం వెళ్ళే చెరువు కట్ట పై గ్రావెల్ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, 11వ వార్డు కౌన్సిలర్ బానోతు రజిత జుమ్ములాల్, మున్సిపల్ కమిషనర్ అవినాష్, కౌన్సిలర్లు పిల్లలమర్రి శారద నారాయణ, ముంజాల రవీందర్, నూనె రాజు, జక్కం రవికుమార్ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, జిల్లా నాయకులు గడ్డం కుమార్ రెడ్డి పైడిపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ
కంటి వెలుగు కార్యక్రమాన్ని పోలిస్ అధికారులు, సిబ్బంది, హౌంగార్డ్స్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా ఆర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి పరీక్షల తీరుతెన్నులపై సంబంధిత అధికారులు, కంటి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి కంటి అద్దాలు, మందులను అందజేసారు. నిత్యం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది, తమ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల్లో కంటి సమస్యలతో బాధప డుతున్న వారు కంటి వెలుగును సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, బండ సతీష్, సంతోష్, డాక్టర్లు, ఉమాదేవి, భాస్య, నర్మద, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.