Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
మహిళలల్లో మానసిక ఉల్లాసం కలుగజేసేందుకు క్రీడలు ఎం తగానో దోహదపడుతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రీడోత్స వాలు నియోజకవర్గ వ్యాప్తం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాలమైదానంలో పలు రకాల క్రీడలను ఎమ్మె ల్యే ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో క్రీడల్లో పాలుపంచు కోవడం అభినందనీయమన్నారు. పట్టణంలో మార్చి 2వ తేది వర కు మండల, పట్టణ స్థాయి క్రీడలు నిర్వహిస్తామని నిర్వాహకులు తె లిపారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, జెడ్పీఫ్లోర్‌లీడర్ పెద్దిస్వప్న, ఎంపీపీ మోతె కలమ్మ, కౌ న్సిలర్ దార్ల రమాదేవి, రా యిడి కీర్తి, గందె రజిత, వే ల్పుగొండ పద్మ, డాక్టర్ భా రతీ, అంగన్వాడీ యూని యన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతీ, మాజీ జెడ్పీ టీసీ పెండెం రాజేశ్వరీ, బీ ఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మండలాధ్యక్షులు నామాల సత్యనారాయణ, బీఆర్ఎస్వీ జిల్లాఅధ్యక్షులు గోనె యువరాజులు పాల్గొన్నారు.
ఖానాపురం : మండలంలోని బుధరావుపేట గ్రామంలో ప్ర పంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల క్రీడలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మా ట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా మొదటగా బుధరావుపేట గ్రా మంలో మహిళా క్రీడా ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో ఉన్న ఐక్యతను వెలిక్కి తీయడానికి వ్యక్తిగతంగా మహిళ క్రీడలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతఏడాది మహిళా క్రీడా ఉత్స వాలలో 4వేలమంది పైచిలుకు మహిళలు పాల్గొన్నారని, ఈ సంవ త్సరం మహిళలలో చైతన్యం పెంపొంది 8 వేలమంది క్రీడలలో పా ల్గొంటున్నట్టుగా వారు తెలిపారు. మండలాల వారీగా రానున్న నా లుగురోజులు క్రీడలు నిర్వహించి గెలుపొందిన జట్లకు నియోజకవ ర్గంలో మళ్లీపోటీలు నిర్వహించి గెలుపొందిన మహిళలకు, మహిళా జట్లకు ప్రపంచ మహిళా దినోత్సవం రోజున బహుమతులను అంద జేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ రామస్వామి నా యక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, వైస్ ఎంపీపీ రామ సహా యం ఉమారాణి ఉపేందర్‌రెడ్డి, ఎంపీటీసీ బోడపూలు భారతి, స ర్పంచ్ కాస ప్రవీణ్, ఎంపీడీవో సుమనవాణి, పంచాయతీ కార్యదర్శి రజిత, తదితర ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్లబెల్లి : మార్చి 8న ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్క రించుకొని మండల కేంద్రంలోని ఎస్సీహాస్టల్‌లో నిర్వహిస్తున్న క్రీడల ను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారం భించి పరిశీలిం చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీర క ఉత్తేజానికి ఎంతగానో దోహదప డతాయని, మండలంలోని ప్రతీ మహిళ క్రీడలలో పాల్గొని స్నేహపూర్వకంగా ఆడుకోవాలని కోరారు. క్రీడలతో మనసుప్రశాంతంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఉడు గుల సునీత ప్రవీణ్‌గౌడ్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి, ఎంపీడీవో విజరు కుమార్, స్థానిక సర్పంచ్ నానబోయిన రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరా వు, పిఈడిలు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు, ఏపీవో సునీ త, మండలంలోని ఇతర గ్రామ సర్పంచులు, ఇతర గ్రామాల క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.