Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి
- గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
నేడు జిల్లా కేంద్రంలో జరిగే రేవంత్ రెడ్డి హాత్‌సే హాత్ జోడయాత్రను విజయవంతం చేయా లని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాటాడారు. సోమవారం రాత్రి 9 గంటలకు కాసింపల్లి గ్రామా నికి రేవంత్‌రెడ్డి రానున్నారని, అక్కడే బస చేయ నున్నట్లు తెలిపారు. నేడు ఉదయం 7 గంటలకు కేటీకే - 5 ఇంక్లైన్ వద్ద సింగరేణి కార్మికులతో ఏర్పా టు చేసిన గేట్ మీటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్కడి నుండి కాసింపల్లి గ్రామానికి చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు కాసింపల్లి గ్రామం నుండి యాత్ర ప్రారంభమై సెగ్గంపల్లి, జంగేడు, రాంనగర్, ఎల్బినగర్, లక్ష్మీనగర్, రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా అంబేడ్కర్ సెంటర్ వరకు చేరుకుంటుందన్నారు. సాయంత్రం 7 గంటలకు అంబేద్కర్ సెంటర్లో జరిగే పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడతారని తెలిపారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు అభిమానులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు తొలగించాలి
భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో ఇటీవల కేటీఆర్ సభ నేపథ్యంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లికి రేవంత్ రెడ్డి రానున్నారని అన్నారు. అంబేద్కర్ సెంటర్ల జరిగే పబ్లిక్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారని, స్థానిక మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలను తొలగించాలని కోరినా తొల గించలేదని, ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు ఏజెంట్లుగా పనిచేయడం సరికాదన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, ఐ ఎన్ టి యు సి నాయకుడు పసునూటి రాజేందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, అంబాల శ్రీనివాస్, రవీందర్, మహేందర్, రజినీకాంత్, రంజిత్, పద్వి, చరణ్, కిషోర్ రెడ్డి తదితరులు ఉన్నారు.