Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఓటు జిఎంకు వినతి
నవతెలంగాణ- కోల్ బెల్ట్
భూపాలపల్లి ఏరియాలోని ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు ఇప్పిం చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఎస్ ఓ టు జి ఎం వెంకటయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య మాట్లాడుతూ.. చాలీచాలని, నెలలో ఎప్పుడు వస్తాయో తెలియని వేతనాలతో సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులు బతుకీడుస్తున్నారని అన్నారు. ఇంటి అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో సుమారు 1700మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా బొగ్గు ఉత్పత్తిలో భాగస్వాములైనప్పటికీ కాంట్రాక్ట్ కార్మికు లు పావలా వంతు ప్రతిఫలం కూడా నోచుకోవడం లేదన్నారు. ఏరియాలో కొత్త క్వార్టర్లు నిర్మితమైన తరుణంలో కనీసం ఖాళీ అయ్యే బారెక్లనైనా వారికి కేటాయించి న్యాయం చేయాలని కోరారు. కార్మికు లకు ఐదు సంవత్సరాలుగా సీఎం పిఎఫ్ చిట్టీలు ఇవ్వకపోవడంతో లెక్కలు తెలవక అయోమయానికి గురవుతున్నారని అన్నారు. ప్రతి నెలా 7న రావాల్సిన జీతం నెలాఖరి వరకు కాంట్రాక్టర్ చెల్లిం చడం లేదని అన్నారు. స్పందించిన ఎస్ఓటు జీఎం కాంట్రాక్టర్ ను పిలిపించి మాట్లాడతానని, క్వార్టర్ల విషయం పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రమేష్, మహేందర్, ఐలయ్య, లక్ష్మి, స్వామి, సుధాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.