Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ములుగు మండలం మదనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం నల్లెల్ల కుమారస్వామి సంతాప దినం నిర్వ హించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యమ నాయకుడు ములుగు జిల్లా సాధన కోసం అహర్ని శలు పని చేసి పేద ప్రజలకు నిత్యం,అనునిత్యం అందుబాటులో ఉండి సేవ చేసిన మహా నాయకుడు కుమారస్వామి అని కొనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. అలాగే కుమారస్వామి కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య పరామర్శించారు. ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : ములుగు జిల్లా సీనియర్ నాయ కులు, కాంగ్రెస్ డీసీసీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి సేవలు మరువలేనివని కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తాడ్వాయి మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బొల్లు విజయ దేవేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సర్పంచ్ ఇర్ప సునీల్ దొర అధ్యక్షతన, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కుమారస్వామి సంతాప సభ ఘనంగా నిర్వ హించారు. మొదట ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, కామారం సర్పంచ్ రేగా కళ్యాణి, మాజీ సర్పంచులు ముజఫర్ హుస్సేన్, లంజపల్లి నరసయ్య, బెజ్జూరి శ్రీనివాస్, కోర్నెబెల్లి లక్ష్మీ నరసయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు రంగర బోయిన జగన్, యానాల సిద్దిరెడ్డి, భాషబోయిన రమేష్, లాలయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన పాక సాంబయ్య, సతీష్, తదితరులు పాల్గొన్నారు.