Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని అంగన్ వాడి కేంద్రాలు సమయపాలన పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీఓ నరసింహమూర్తి అన్నారు. సోమవారం మండలంలోని వల్లేంకుంట గ్రామ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో చిన్నారులకు,గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందించే పోషకాహర పదార్థాల సరఫరా వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. రోజువారీ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి నరేశ్, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.