Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ప్రజల నుండి వచ్చిన ధరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సిహెచ్ శివలింగ య్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు చేసుకున్న ఆర్జీలను పరిశీలించి త్వరగా పరి ష్కరించాలని, వారి ఫరిధిలో లేకుంటే అర్జీదారులకు సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించా రు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన మొత్తం 67 విజ్ఞప్తుల్లో అత్యధి కంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చి నట్లు తెలిపారు. వాటిని సాధ్యమైనంత వరకు పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పా రు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణిని నిర్వహించి అర్హులైన వారి కి ధృవీకరణ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఒలు మధుమోహన్, కృష్ణవేణి, డిఆర్‌డిఒ పిడి రాంరెడ్డి, ఎన్పిడిసిఎల్ ఎస్.ఈ.వేణుమాధవ్, డిపిఒ వసంత, సిపిఇ ఇస్మాయిల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్, ము న్సిపల్ కమీషనర్ రజిత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రోజా రాణి, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, సహకారశాఖ అధికారి కిరణ్‌కుమార్, పంచాయతీ రాజ్ ఈ.ఈ.చంద్రశేఖర్, హౌసింగ్ ఈ.ఈ.దామోదర్‌రావు, ఉద్యాన వన శాఖ అధికారి లత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా...
ప్రజావాణి కార్యక్రమం నిర్వహణపట్ల జిల్లా అధికారుల్లో చిత్తశుద్ది తగ్గి పోయిందేమోనని ధరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన ప్రజలు చర్చించు కోవడం కనిపించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావల్సిన గ్రీవెన్స్ సెల్ లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు క్యూ కట్టినా వాటిని స్వీకరించే అధి కారులు సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సొమవారం నిర్వహిం చిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు, జిల్లా ఇతర అధికారులు సమయానికి వచ్చినా ధరఖాస్తులను స్వీరించే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఇరువురు కూడా ఆలస్యంగా రావడంతో అక్కడ గుమికూడిన ప్రజలను అదుపు చేసేందుకు జన గామ పోలీసులు, రెవెన్యూ శాఖ కింది స్థాయి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. వికలాంగుల ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన వారికోసం ప్రత్యేకంగా డిఆర్డిఎ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయంతో గొడవ సద్దుమణిగింది.