Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు
నవతెలంగాణ-జఫర్గడ్
గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12 నుండి 28 వరకు పాలకుర్తి నుండి పట్నం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. పాద యాత్ర ముగింపు సభ ఈనెల 28న ఇందిరాపార్క్ హైదరాబాద్లో ఉంటుందని ఈ సభకు గ్రామపంచాయతీ సిబ్బంది అందరూ తరలిరావాలని గ్రామపంచాయ తీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జి ల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన సమావేశానికి యాతం సమ్మయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతి థిగా రాపర్తి రాజు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభు త్వం వివక్షత చూపుతోందని సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. జిల్లా మంత్రి దయాకర్ రావు నియోజవర్గం పాలకుర్తి నుండి పాదయాత్ర చేపట్టిన పంచాయతీ సిబ్బందిని తన అధికార కార్యక్రమాల కోసం పారిశుధ్యం పనులు చేయించుకోవడం తప్ప వారి బాగోగులు పట్టించుకునే తీరిక మంత్రికి లేకపోవ డం శోచనీయమన్నారు. తెలంగాణలో గ్రామపంచాయతీ కార్మికులను మల్టీ పర్ప స్ వర్కర్ విధానం పేరుతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని 26 వేల వేతనం ఇవ్వాలని కారోబారు బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో పాదయాత్ర నడు స్తుంది అన్నారు.పాదయాత్ర బృందం సభ్యులకు కాళ్ళకు బొబ్బలు వచ్చి రక్తం కారు తున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామపంచాయతీ పాదయాత్ర బృందాన్ని చర్చలకు పిలవా లని వారి సమస్యల పరిష్కారం కోసం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28వ తేదీన పాద యాత్ర ముగింపు సభ హైదరాబాదులో వేలాది మంది తో జరుగుతుందని ఈ సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ప్రజల ముందు ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ప్రభుత్వం స్పందించేలా పోరాటాలు చేపడుతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ యాతం సమ్మయ్య సిఐటియు మండల నాయకులు నల్ల తీగల శ్రీనివాస్ సిద్ధం సోమయ్య కుల్ల రామచంద్రం కుమార్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.